News March 3, 2025
LXPT: ఉపాధ్యాయ విద్యకు దరఖాస్తులు ఆహ్వానం

లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిష్ఠాత్మకమైన ఉపాధ్యాయ విద్యార్థి కోర్సు అందుబాటులోకి వచ్చినట్లు ప్రిన్సిపల్ మహాత్మ సంతోష్ తెలిపారు. నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బిఎ. బిఎడ్‌లో ప్రవేశం కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 విద్యా సంవత్సరం కోసం అర్హత, ఆసక్తి ఉన్న వారు మార్చి 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 6, 2025
రెడ్ క్రాస్ వ్యవస్థను బలోపేతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో రక్త కొరత రాకుండా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ జి.రాజకుమారి కమిటీ సభ్యులను సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ నూతన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రతీ పాఠశాలలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్లను, ప్రతీ కళాశాలలో యూత్ రెడ్ క్రాస్ బృందాలను ఏర్పాటు చేసి దాదాపు లక్ష మంది విద్యార్థులను రెడ్ క్రాస్ సభ్యులుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
News December 6, 2025
రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News December 6, 2025
ప్రకాశంలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.. కానీ!

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందినట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలానికి చెందిన వృద్ధురాలు గత నెల 11న అనారోగ్యానికి గురై మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారన్నారు. 29న అక్కడ నిర్వహించిన టెస్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మృతికి కారణంగా డీఎంహెచ్‌వో తెలిపారు.


