News March 3, 2025
LXPT: ఉపాధ్యాయ విద్యకు దరఖాస్తులు ఆహ్వానం

లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిష్ఠాత్మకమైన ఉపాధ్యాయ విద్యార్థి కోర్సు అందుబాటులోకి వచ్చినట్లు ప్రిన్సిపల్ మహాత్మ సంతోష్ తెలిపారు. నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బిఎ. బిఎడ్‌లో ప్రవేశం కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 విద్యా సంవత్సరం కోసం అర్హత, ఆసక్తి ఉన్న వారు మార్చి 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 20, 2025
ORR పరిధిలో 61% చెరువుల జాడ కనుమరుగు..!

ఔటర్ రింగురోడ్డు పరిధిలో 1,025 చెరువులుండగా, ఇందులో 61% జాడ లేకుండా ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న 39% చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రంగనాథ్ చెప్పుకొచ్చారు.
News March 20, 2025
నా టెంపర్‌మెంట్ ఏం మారలేదు: సీఎం రేవంత్

TG: తాను ముఖ్యమంత్రి అయినా 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి టెంపర్‌మెంట్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ తెలిపారు. ‘2004లో ప్రజల్లోకి వచ్చాను. నేటికీ టెంపర్‌మెంట్‌లో ఛేంజ్ లేదు. సీఎంగా హుందాగా వ్యవహరించాలని కొంతమంది అంటుంటారు కానీ అలా వ్యవహరిస్తే అటువైపు అర్థం చేసుకునేవారు ఉండాలి కదా? టెంపర్‌మెంట్ పోతే న్యాయం చేయలేం. నా దూకుడు పోలేదు కానీ జ్ఞానం పెరిగింది’ అని తెలిపారు.
News March 20, 2025
నిర్మల్ జిల్లాలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

నిర్మల్ జిల్లాలో మూడ్రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలగనుంది. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్న ఆందోళన చెందుతున్నారు. రైతులు పంటలను సంరక్షిచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.