News November 15, 2024

LXPT: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. కళ్లు దానం చేసిన కుటుంబ సభ్యులు

image

రోడ్డు ప్రమాదంలో మరణించిన లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొమ్మిడి అరుణ్ కుమార్ అనే యువకుడి కళ్ల‌ను కుటుంబ సభ్యులు దానం చేసి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ అభిషేక్ సహకారంతో నేత్రాలలోని కార్నియాను సేకరించి హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకుకు తరలించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఛైర్ పర్సన్ వి. మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 22, 2025

ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

image

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.

News November 22, 2025

నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

image

నార్నూర్‌లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్‌లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.