News March 25, 2025

LXT: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని లక్షెట్టిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ మహాత్మ తెలిపారు. విద్యార్థులు త్వరగా చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News April 21, 2025

అనకాపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 320 అర్జీలు: జేసీ

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు 320 అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ.. సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించారు.

News April 21, 2025

NZB: రైతు మహోత్సవం అట్టహాసంగా ప్రారంభం

image

నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సలహాదారు షబ్బీర్ అలీ, పోచారం పాల్గొన్నారు. ఐదు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. వ్యవసాయ, పశుపోషణ, సేంద్రీయ పద్ధతులపై 150 స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

News April 21, 2025

త్వరలో తులం బంగారం రూ.1.25 లక్షలు?

image

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం మరింత తీవ్రమైతే 2025 చివరినాటికి బంగారం ధర ఔన్స్‌కు $4500కి చేరుకోవచ్చని ప్రముఖ ట్రేడ్ దిగ్గజం ‘గోల్డ్‌మన్ సాచ్స్’ పేర్కొంది. ఔన్స్ ధర $4500 అయితే భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1.25 లక్షలకు చేరుకుంటుంది. కాగా, ఇవాళ తొలిసారి బంగారం రూ.లక్షను టచ్ చేసిన విషయం తెలిసిందే. SHARE IT

error: Content is protected !!