News March 25, 2025
LXT: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని లక్షెట్టిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ మహాత్మ తెలిపారు. విద్యార్థులు త్వరగా చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News March 28, 2025
ఏప్రిల్ 9 వరకు వంశీ రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీ రిమాండ్‌ను ఏప్రిల్ 8 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
News March 28, 2025
తిరువూరులో వేడెక్కుతున్న రాజకీయం

AMC మాజీ ఛైర్మన్ రమేశ్ రెడ్డికి స్థానిక ఎంపీ మద్దతు ఉందని ఎమ్మెల్యే కొలికపూడి నిన్న ఆరోపించారు. రమేశ్‌పై పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే తెలుపగా..రూ.2 కోట్లు అడిగితే తాను ఇవ్వకపోవడంతో కొలికపూడి తనపై నిందలు వేస్తున్నారని రమేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో తిరువూరులో MP Vs MLAగా వివాదం తీవ్రమవుతోంది. ఆరోపణలు చేసేవారు ఓపెన్ డిబేట్‌కి రావాలని MLA సవాల్ విసిరారు.
News March 28, 2025
మా శ్రమతోనే BYD రాష్ట్రానికి వచ్చింది: కేటీఆర్

TG: తాము అధికారంలో ఉన్నప్పుడు పడ్డ శ్రమ రాష్ట్రానికి ఇప్పుడు ఫలితాల్ని ఇస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్‌లో తెలిపారు. ‘BYD రాష్ట్రంలో 10బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 2022-23లో ఒప్పందం చేసుకున్నాం. కేంద్రం కారణంగా అప్పట్లో అది ఆగింది. ఆ పెట్టుబడులు ఎట్టకేలకు రాష్ట్రానికి వస్తుండటం సంతోషం. కేవలం మా ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.