News July 1, 2024
ఇవాళ భారతీయుడు-2 నుంచి లిరికల్ వీడియో

భారతీయుడు-2 సినిమా నుంచి ఇవాళ సా.6 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ స్పెషల్ సాంగ్‌లో మిస్ యూనివర్స్-2017 డెమి లీ నెల్ పీటర్స్ నర్తించినట్లు తెలిపారు. వేడిని పెంచే ఈ పాట కోసం సిద్ధంగా ఉండాలంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా శంకర్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
Similar News
News April 11, 2026
మృతుడి ‘ఆధార్’ను డీయాక్టివేట్ ఎలా చేయాలి?

ఎవరైనా చనిపోయాక వారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం ముఖ్యం. లేదంటే ఆ నంబర్ ఆధారంగా దుండగులు సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.
✒ https://myaadhaar.uidai.gov.in/లోకి వెళ్లి కుటుంబీకుల్లోని ఒకరి ఆధార్‌తో లాగిన్ అవ్వాలి.
✒ ‘రిపోర్ట్ డెత్ ఆఫ్ ఎ ఫ్యామిలీ నంబర్’ ఆప్షన్‌ను ఎంచుకొని మృతుడి వివరాలు నమోదు చేయాలి.
✒ డెత్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
#ShareIt
News April 11, 2026
‘పెద్ది’ స్పెషల్ సాంగ్.. ఇంకా దొరకని హీరోయిన్?

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్‌కు చిన్న బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ వారంలో చిత్రీకరించాల్సిన స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ వేట ఇంకా కొలిక్కి రాలేదట. ఇప్పటికే మానస వారణాసి వంటి భామల పేర్లు పరిశీలించినా పాట స్థాయికి తగ్గ వారి కోసం మూవీ యూనిట్ అన్వేషిస్తోందని సమాచారం. హీరోయిన్ ఖరారు కాకపోవడంతో షెడ్యూల్‌లో జాప్యం జరుగుతోంది. ఇది మూవీ రిలీజ్‌పై ప్రభావం చూపుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
News April 11, 2026
ఉద్యోగికి ఇంతకంటే అవమానం ఉంటుందా?

ఉద్యోగం కోల్పోవడం ఎవరికైనా బాధాకరమే. కానీ తన స్థానంలో కొత్తగా వచ్చిన వారికి తానే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తే మరింత దారుణంగా ఉంటుంది. ఇలాంటి అవమానకరమైన పరిస్థితి తనకు ఎదురైందంటూ ఓ మహిళ redditలో చేసిన పోస్టు వైరలవుతోంది. ‘నేను నిజాయతీగా 100 శాతం పనిచేశా. కానీ నన్ను తొలగించారు. అదే పనికి ఇద్దరిని తీసుకున్నారు. కొన్ని నెలల తర్వాత వారికి ట్రైనింగ్ ఇవ్వాలని నన్నే పిలిచారు’ అని ఆమె రాసుకొచ్చారు.


