News March 16, 2025
M.Pharmacy, M.Tech ఫలితాలు విడుదల

అనంతపురం JNTU పరిధిలో గతేడాది నవంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన M.Pharmacy 1, 2, 4వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21), M.Tech 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. Share It
Similar News
News December 9, 2025
భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు

వరంగల్ భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్ల బాగోతం బయటకు వచ్చింది. ఇద్దరు ఉద్యోగులు ఒకే సీరీస్ నంబర్లున్న టికెట్లను భక్తులకు విక్రయించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాజీపేటకు చెందిన భక్తుడు నకిలీ టికెట్లు ఉన్నాయంటూ ఆలయం ఈవో రామల సునీతకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆలయ బోర్డులో చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు. నకిలీ టికెట్ల విక్రయం భద్రకాళి ఆలయంలో చర్చనీయాంశమైంది.
News December 9, 2025
చివ్వెంలలో తెల్లవారుజామున భారీ పేలుడు

చివ్వెంల మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. బ్రిక్స్ యూనిట్లోని పీడన ఫోమ్ తయారీ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగిందని స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దం భారీగా ఉండడంతో సమీపంలోని బీబీగూడెం, మున్యా నాయక్ తండా ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు తండోపతండాలుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News December 9, 2025
అల్లూరి జిల్లాలో రోడ్డెక్కనున్న నైట్ హల్ట్ బస్సులు

మావోయిస్టులు ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు PLGA వారోత్సవాలు ప్రకటించడంతో గిరిజన ప్రాంతానికి వచ్చే నైట్ హల్ట్ బస్సులు సోమవారం వరకు పలు ప్రాంతాలకు నిలిపివేయడం, కొన్ని బస్సులు పోలీసు స్టేషన్ సమీపంలో ఉంచడం జరిగేది. నిన్నటితో వారోత్సవాలు ముగిసాయి. నేటి నుంచి నైట్ హల్ట్ బస్సు సర్వీసులు వై.రామవరం, రాజవొమ్మంగి, రెవళ్లు యధావిధిగా నడుస్తాయని ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు.


