News March 16, 2025
M.Pharmacy, M.Tech ఫలితాలు విడుదల

అనంతపురం JNTU పరిధిలో గతేడాది నవంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన M.Pharmacy 1, 2, 4వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21), M.Tech 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. Share It
Similar News
News April 1, 2026
కడప: కోటాను మించి విద్యుత్ వినియోగం.!

కడప విద్యుత్ సర్కిల్ (SE) పరిధిలో మార్చి నెలలో విద్యుత్ వినియోగం పెరిగింది. మార్చి నెలకు 427.112 MU కోటా కాగా.. మార్చి 30 వరకు 484.178MU వినియోగం జరిగింది. డివిజన్ వారీగా విద్యుత్ కోటా, వినియోగం వివరాలు ఇలా ఉన్నాయి.
➤ కడప-43.410-70.587 MU
➤ పులివెందుల-72.270-82.467 MU
➤ ప్రొద్దుటూరు-136.890-117.650 MU
➤ మైదుకూరు-59.169-82.462 MU
➤ రాజంపేట-62.576-75.763 MU
➤ రాయచోటి-52.806-55.249 MU.
News April 1, 2026
అవినీతి అధికారికి 7 ఏళ్ల జైలు శిక్ష

లంచం కేసులో అనంతపురం గిరిజన సంక్షేమ శాఖ అధికారి జి.నాగభూషణానికి కర్నూలు ఏసీబీ కోర్టు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.2 లక్షల జరిమానా విధించగా.. బాధితుడికి రూ.1.90 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. వివరాల్లోకెళ్తే.. 2018లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ బిల్లు మంజూరు కోసం రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.
News April 1, 2026
ప.గో: ఈ ఉద్యోగాలు వీరికి మాత్రమే

ఉమ్మడి ప.గో జిల్లాలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు 29 బ్యాక్ లాగ్ ఉద్యోగాలు కేటాయిస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారని ప్రతిభావంతుల సహాయ సంచాలకులు రామ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఏప్రియల్ 21 సాయంత్రం 5 లోపు 18-52 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేయాలన్నారు. వివరాలకు http://eluru.ap.gov.in వెబ్ సైట్ (SRD-Backlog Vacancies Notification for Persons with Disabilities) పరిశీలించాలన్నారు.


