News August 22, 2025
M.Tech, M.Pharmacy పరీక్షా ఫలితాలు విడుదల

అనంతపురం JNTUలో జులైలో నిర్వహించిన M.Tech 1, 2, 3వ సెమిస్టర్ల, M.Phamarcy 1, 2, 3వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ విడుదల చేశారు. విద్యార్థులు https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చూసుకోవచ్చన్నారు.
Similar News
News August 23, 2025
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు: కలెక్టర్

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రైతులు మీ గ్రామ పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఎరువులను తీసుకోవచ్చన్నారు. రైతు సేవా కేంద్రం వద్ద సరిపడ స్టాక్ ఉందన్నారు. గ్రామ, మండల వ్యవసాయ అధికారులను, రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలన్నారు.
News August 22, 2025
బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల

శ్రీకృష్ణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల విభాగంలో డైరెక్టర్ జీవి రమణ, కంట్రోలర్ శ్రీరామ్ నాయక్, అసిస్టెంట్ రిజిస్టార్ శంకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలాజీ నాయక్ గురువారం ప్రకటించారు. మొత్తం 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 60 మంది ఉత్తీర్ణత సాధించారని వారు తెలిపారు. ఫలితాల కోసం ఎస్కేయూ వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
News August 22, 2025
గణేశ్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోండి: ఎస్పీ

అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా గణేశ్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ పి.జగదీశ్ తెలిపారు. జిల్లాలో వినాయక ఉత్సవాల అనుమతుల కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ganeshutsav.net అనే వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అనుమతులు పొందాలని సూచించారు. అనుమతి పత్రంలో సూచించిన నిబంధనలను తప్పక పాటించాలన్నారు.