News April 6, 2025
CPM ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన MA బేబీ

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా MA బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులో నిర్వహిస్తున్న పార్టీ మహాసభల్లో నేతలంతా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి దశలో కేరళ స్టూడెంట్ ఫెడరేషన్లో చేరికతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బేబీ 1986 నుంచి 1998 వరకూ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కేరళ మంత్రిగానూ సేవలందించారు. సీతారాం ఏచూరి మరణంతో ఇంతకాలం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది.
Similar News
News April 7, 2025
రేపు రాప్తాడుకు మాజీ సీఎం జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.
News April 7, 2025
ఒలింపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ విడాకులు?

ఒలింపిక్ మెడలిస్ట్, బాక్సింగ్ ఐకాన్ మేరీకోమ్ వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. భర్త కరంగ్ ఓంఖోలర్(ఓంలర్)తో ఆమె విడాకులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. మరో బాక్సర్ భర్తతో ఆమె ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం ఆయన తన బిజినెస్ పార్ట్‌నర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో కలసి దిగిన ఫొటోలు ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ పుకార్లేనని కొందరు కొట్టిపడేస్తున్నారు.
News April 7, 2025
భార్య వల్ల పదవి పోగొట్టుకున్న అధ్యక్షుడు

భార్య తీసుకున్న బహుమతి ఏకంగా అధ్యక్షుడి పదవికే ఎసరు తెచ్చింది. S.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై పార్లమెంటు అభిశంసనను కోర్టు సమర్థించడంతో అక్కడ 2 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ఒక పాస్టర్ నుంచి ఆమె ఓ లగ్జరీ బ్యాగ్ బహుమతిగా అందుకున్నారు. దీనిపై అక్కడి ప్రతిపక్షాలు యూన్ సుక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆ తర్వాత అక్కడ మార్షల్ లా ప్రకటించారు.