News July 18, 2024
యూట్యూబర్లపై పోలీసులకు ‘మా’ ఫిర్యాదు

TG: నటీనటులపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబర్లపై మూవీ ఆర్టిస్ట్స్(మా) అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మా’ ప్రతినిధులు రఘుబాబు, శివబాలాజీ డీజీపీని కలిసి తమ ఫిర్యాదును అందజేశారు. ప్రణీత్ హనుమంతు ఘటన తర్వాత యూట్యూబర్లకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రోలింగ్ వీడియోలన్నింటినీ తొలగించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అప్పట్లో తేల్చిచెప్పారు.
Similar News
News November 23, 2025
భీమ్గల్: 11 ఎకరాలను విరాళంగా ఇచ్చిన మహేశ్ గౌడ్

TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తన సొంత గ్రామమైన రహత్ నగర్పై దాతృత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం తన 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 10 ఎకరాలు, సబ్స్టేషన్కు 1 ఎకరాన్ని అందజేసి గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ భూమి పూజలో ఆయన పాల్గొన్నారు.
News November 23, 2025
తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.
News November 23, 2025
పొల్యూషన్ నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే

ప్రస్తుతం వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారింది. లైంగిక పరిపక్వత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెర్రీస్, బ్రోకలీ, పసుపు, ఆకుకూరలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారని చెబుతున్నారు.


