News June 4, 2024
మాచర్ల: పిన్నెల్లి కోటను బద్దలుకొట్టిన బ్రహ్మానందరెడ్డి

AP: ఎన్నికల పోలింగ్ సమయంలో అల్లర్లతో దేశవ్యాప్తంగా సంచలనమైన పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ గెలుపొందింది. అక్కడ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 32,324 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో 25 ఏళ్లుగా మాచర్లను ఏలుతున్న పిన్నెల్లి కోటను జూలకంటి బద్దలుకొట్టినట్లయింది.
Similar News
News November 24, 2025
ఫిలింఫేర్ అవార్డుపై ధర్మేంద్రకు అసంతృప్తి

నటనలో శిక్షణ తీసుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ అయినా ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు లభించలేదనే అసంతృప్తి ఉండేదని పలుమార్లు చెప్పేవారు. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం ఆనందాన్నిచ్చిందని ఉద్వేగభరితంగా చెప్పుకున్నారు. ‘గరమ్ ధరమ్ దాబా’, ‘హీ మ్యాన్’ బ్రాండ్లతో రెస్టారెంట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు.
News November 24, 2025
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై సీఎం సమీక్ష

APలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై CM చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఈ సిస్టమ్ పనిచేయనుంది. దీనివల్ల అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలు ఉంటుంది. కాగా కాసేపట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘంతో CM సమావేశం కానున్నారు.
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>


