News May 22, 2024
పరారీలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి?

AP: మాచర్ల YCP MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన తన కారు వదిలి పరారైనట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని CEO, DGPని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
Similar News
News November 14, 2025
ప్రతిరోజూ ABC జ్యూస్ తాగితే జరిగేది ఇదే

ABC జ్యూస్.. యాపిల్, బీట్రూట్, క్యారెట్‌తో తయారు చేస్తారు. షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5గ్రా. ప్రొటీన్స్ లభించే ఈ జ్యూస్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. పరగడుపున తాగితే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖం యంగ్‌గా కనిపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువ ఉన్నందున బరువు తగ్గుతారు. 100మి.లీ జ్యూస్‌లో 45-50 కేలరీలు, 10-12గ్రా. కార్బోహైడ్రేట్లు బాడీకి అందుతాయి.
News November 14, 2025
పెరగనున్న ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు!

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రానున్నట్లు తెలుస్తోంది. 2025-27 పీరియడ్‌కు సంబంధించి కొత్త ఫీజుల ప్రతిపాదలను టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి పంపగా ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటంతో జీవో నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతితో విడుదల చేయనుంది.
News November 14, 2025
KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

<


