News December 13, 2024

నేడు ఫ్రాన్స్ ప్రధానిని ప్రకటించనున్న మేక్రాన్

image

ఫ్రాన్స్‌కు తదుపరి ప్రధానిని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నేడు ప్రకటించనున్నారు. 48 గంటల్లో కొత్త ప్రధానిపై ప్రకటన ఉంటుందని రెండు రోజుల క్రితం ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంలో గత ప్రధాని మైకేల్ బార్నియర్ ఓడిపోవడంతో ఆయన గత వారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయంగా ఆ దేశంలో ఆరు నెలల్లో ఇది రెండో సంక్షోభం కావడం గమనార్హం.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్‌ హాల్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ సెంటర్‌లో ఉన్నారు. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరో రెండు గంటల్లోపు గెలుపు ఎవరిది? అనేది ఓ క్లారిటీ రానుందని టాక్.

News November 14, 2025

పర్యావరణం కోసం ఈ వారియర్ మామ్స్

image

దిల్లీలో శీతాకాలం వచ్చిందంటే చాలు వాయుకాలుష్య తీవ్రత పెరిగిపోతుంది. దీన్ని ఎదుర్కోవడానికి బవ్రీన్‌ వారియర్‌ మామ్స్‌కు శ్రీకారం చుట్టారు. వాయుకాలుష్యం చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తుల్లోని పోషక విలువలను నాశనం చేస్తుందంటున్న బవ్రీన్ ఎన్నో ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారియర్ మామ్స్‌లో ప్రస్తుతం 1400లకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు.

News November 14, 2025

ప్రతిరోజూ ABC జ్యూస్ తాగితే జరిగేది ఇదే

image

ABC జ్యూస్.. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారు చేస్తారు. షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5గ్రా. ప్రొటీన్స్ లభించే ఈ జ్యూస్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. పరగడుపున తాగితే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖం యంగ్‌గా కనిపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువ ఉన్నందున బరువు తగ్గుతారు. 100మి.లీ జ్యూస్‌లో 45-50 కేలరీలు, 10-12గ్రా. కార్బోహైడ్రేట్లు బాడీకి అందుతాయి.