News September 18, 2024
‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

నార్నె నితిన్ హీరోగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. మూవీ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తూ ఈనెల 20న ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది బ్లాక్ బస్టర్గా నిలిచిన కామెడీ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’కు సీక్వెల్గా ఈ చిత్రం రానుండగా నాగవంశీ నిర్మిస్తున్నారు.
Similar News
News November 24, 2025
DEC తొలి వారంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు!

AP: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి DEC తొలి వారంలో నియామక పత్రాలు అందజేసి, శిక్షణకు పంపిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చినట్లు MLC వేపాడ చిరంజీవి తెలిపారు. ఇదే విషయమై ఆమెకు లేఖ రాయగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఈ ఏడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి AUGలో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు నిరాశతో ఉన్నారు.
News November 24, 2025
బీమా కంపెనీల విలీనం.. పార్లమెంటులో బిల్లు?

బ్యాంకుల తరహాలోనే ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లను ఒకే కంపెనీగా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది. వాటిని ఆర్థికంగా మెరుగుపర్చడమే దీని ఉద్దేశం. 2018-19లో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్లో వీటి బలోపేతానికి కేంద్రం ₹17450Cr కేటాయించింది.
News November 24, 2025
ఎయిమ్స్ కల్యాణి 172 పోస్టులకు నోటిఫికేషన్

పశ్చిమ బెంగాల్లోని <


