News April 19, 2024
‘మ్యాడ్’కు సీక్వెల్గా ‘మ్యాడ్ స్క్వేర్’.. షూటింగ్ ప్రారంభం

గత ఏడాది విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. దీనికి ‘మ్యాడ్ స్క్వేర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మూవీ షూటింగ్ ఉగాది రోజున లాంఛనంగా ప్రారంభం కాగా ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఇందులో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
Similar News
News December 14, 2025
బిగ్బాస్-9.. భరణి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.
News December 14, 2025
TG రెండో దశ సర్పంచ్ ఎన్నికల అప్డేట్స్

* ఖమ్మం(D) అనాసాగరంలో సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు(40) కన్నుమూశారు. నామినేషన్ రోజే అనారోగ్యంతో ఆస్పత్రి పాలవగా ఇవాళ పోలింగ్ రోజు చనిపోయారు.(ఫొటోలోని వ్యక్తి)
* నారాయణపేట(D) మరికల్కు చెందిన భాస్కర్ దుబాయ్ నుంచి వచ్చి ఓటు వేశారు.
* ఖమ్మం(D) గోళ్లపాడులో ఓ అభ్యర్థి స్లిప్తో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పోలింగ్ కేంద్రం వద్ద ఓ ఆకులోని అన్నం, బొగ్గులు, మాంసం, ఎండుమిర్చి, అభ్యర్థి స్లిప్ పెట్టారు.
News December 14, 2025
40 రోజుల్లో 150కి పైగా పెళ్లిళ్లు రద్దు.. కారణమిదే?

MPలోని ఇండోర్లో 40 రోజుల వ్యవధిలో 150కి పైగా జంటలు తమ పెళ్లిని రద్దు చేసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం(62%) సోషల్ మీడియానే అని ఓ నివేదిక తెలిపింది. పాత రిలేషన్లకు సంబంధించిన SM పోస్టులు గొడవకు దారి తీస్తున్నాయని వెల్లడించింది. మరికొన్ని ఘటనల్లో కుటుంబంలో మరణాలు, ఇతర కారణాలు ఉన్నాయని తెలిపింది. ఇలా ఆకస్మిక రద్దు నిర్ణయాలతో వెడ్డింగ్ ప్లానర్స్, హోటల్ నిర్వాహకులు నష్టపోతున్నారని తెలిపింది.


