News April 15, 2024

నేడు కాంగ్రెస్‌లోకి మదన్‌రెడ్డి

image

TG: మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. నర్సాపూర్ మాజీ MLA మదన్‌రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు CM రేవంత్ సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం నర్సాపూర్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఆయన HYD చేరుకోనున్నారు. పదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించానని, తనను అభిమానించే వారంతా కాంగ్రెస్‌లో చేరుతారని మదన్‌రెడ్డి తెలిపారు.

Similar News

News January 22, 2026

ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

image

లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మద్యం సరఫరాదారుల నుంచి వసూలు చేసిన రూ.3,500 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.

News January 22, 2026

వంటింటి చిట్కాలు

image

* సమోసాల తయారీకి ఉపయోగించే పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలిపితే క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి.
* బిర్యానీలోకి ఉల్లిపాయలను వేయించేటపుడు చిటికెడు చక్కెర వేస్తే ఉల్లిపాయ కరకరలాడుతుంది.
* కూరల్లో కారం, ఉప్పు ఎక్కువైనట్లు అనిపిస్తే స్పూన్‌ శనగపిండి కలపండి చాలు.
* ఓవెన్‌లో బ్రెడ్‌ని కాల్చే సమయంలో.. బ్రెడ్‌తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచితే.. బ్రెడ్‌ గట్టిగా అవదు. మంచి రంగులో ఉంటుంది.

News January 22, 2026

గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై తీర్పు వాయిదా

image

TG: <<17820908>>గ్రూప్-1<<>> అభ్యర్థుల భవితవ్యంపై తీర్పును ఫిబ్రవరి 5కు హైకోర్టు వాయిదా వేసింది. గతంలో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా తుదితీర్పునకు లోబడి నియామకాలు ఉండాలని పేర్కొంది. ఇవాళ తీర్పు వెల్లడించాల్సి ఉండగా కాపీ రెడీ కాకపోవడంతో FEB 5న ఇవ్వనున్నట్లు పేర్కొంది.