News August 27, 2024

మదనపల్లె ఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్

image

AP: రాష్ట్రంలో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయ దస్త్రాల దగ్ధం కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ రాజ్‌కమల్, సీఐడీ ఎస్పీ వేణుగోపాల్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ తేజను ప్రశ్నించారు.

Similar News

News October 31, 2025

ప్రకాశం బ్యారేజ్‌లోకి 4.38L క్యూసెక్కుల వరద

image

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4.38 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా 69 గేట్ల ద్వారా సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్నారు. కృష్ణా నది తీర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 12.9 అడుగుల నీటి మట్టం ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా మొంథా తుఫాను ధాటికి చెరువులు, నదులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి.

News October 31, 2025

మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

image

AP: మాజీ MLA సివేరి సోమా కుమారుడు సురేశ్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. జోన్-1లో డిప్యూటీ తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 3(b) కింద ప్రత్యేక పరిస్థితుల్లో రిక్రూట్‌మెంట్‌లో ఈ స్థానాన్ని భర్తీ చేసినట్లు పేర్కొంది. 2018 SEP 28న నక్సల్స్ కాల్పుల్లో సివేరి సోమా ప్రాణాలు కోల్పోయారు.

News October 31, 2025

అండాశయ క్యాన్సర్‌కు కారణాలివే..

image

ఒవేరియన్ క్యాన్సర్‌కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ వరకూ దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తారు నిపుణులు. విడుదలయ్యే అండాల సంఖ్య తగ్గితే అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా ఉన్నా, పిల్లలు లేకపోయినా, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా, హార్మోన్ చికిత్స తీసుకున్నా దీని ముప్పు పెరుగుతుంది.