News March 3, 2025
యువతులకు మెసేజ్‌లంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన మాధవన్

అమ్మాయిలను ఆకర్షించేలా తాను మెసేజ్‌లు చేస్తాననే ప్రచారాన్ని మాధవన్ ఖండించారు. ఈ ఆరోపణలు రావడానికి గల కారణాన్ని వెల్లడించారు. ‘మీ నటనంటే ఇష్టమంటూ కిస్, హార్ట్ ఎమోజీలతో గతంలో ఓ యువతి మెసేజ్ చేసింది. థాంక్యూ, గాడ్ బ్లెస్‌యూ అని రిప్లై ఇచ్చా. అయితే ఆమె తన మెసేజ్లోని సగాన్ని, నా సమాధానాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ఆ తర్వాత SM వాడకంపై క్లారిటీ తెచ్చుకున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు ఫిబ్రవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA(ఫైనాన్స్, ఆపరేషన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్), బీఫార్మసీ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ మేనేజర్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. అసిస్టెంట్ మేనేజర్‌కు 37ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.lifecarehll.com
News January 29, 2026
అనుమతి లేకుండా NTR పేరు, బిరుదులు వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు

జూ.NTR వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇకపై NTR, జూనియర్ NTR, తారక్, మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ తదితర పేర్లు, బిరుదులను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని నిషేధించింది. తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగే పోస్టులను వెంటనే తొలగించాలని చెప్పింది.
News January 29, 2026
అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన లోకేశ్

AP: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతికకాయాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులు అర్పించారు. బారామతిలో నిర్వహించిన పవార్ అంత్యక్రియల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తదితర ప్రముఖులూ పవార్‌కు వీడ్కోలు పలికారు.


