News June 2, 2024
మాధవీ లత గెలిచే అవకాశం: India Today

దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో అనూహ్య ఫలితం వెలువడే అవకాశం ఉందని India Today Axis My India తెలిపింది. ఎంఐఎం కంచుకోటలో ఈసారి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీ లత మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు తెలిపింది. చివరికి మాధవీ లతనే గెలుపు వరించే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. మొత్తంగా తెలంగాణలో బీజేపీకి 11-12 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే.
Similar News
News January 21, 2026
కొనసాగిన నష్టాలు

స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపారు. ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది. మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకొని చివరికి 270 పాయింట్ల నష్టంతో 81,909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 25,157 వద్ద సెటిల్ అయింది.
News January 21, 2026
అమరావతికి చట్టబద్ధత.. పార్లమెంటులో బిల్లు!

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపైనా నోట్ ఇచ్చింది. కాగా ఏ తేదీ నుంచి రాజధానిగా గుర్తించాలో చెప్పాలని కేంద్రం కోరినట్లు సమాచారం.
News January 21, 2026
గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరో ఐదేళ్లు(2030-31) పొడిగించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం APYలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18-40 ఏళ్ల వారు ఈ స్కీమ్లో చేరొచ్చు. వయసును బట్టి రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది.


