News June 4, 2024

మధ్యప్రదేశ్: క్లీన్‌స్వీప్ దిశగా బీజేపీ

image

లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని యూపీ దెబ్బకొట్టేలా ఉంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఇక్కడ సగం వరకు సీట్లు కోల్పోవచ్చు! అయితే ఆ నష్టాన్ని మధ్య‌ప్రదేశ్ భర్తీచేసేలా కనిపిస్తోంది. మొత్తం 29 నియోజకవర్గాల్లో అన్నింట్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాధిత్య సింధియా, శంకర్ లాల్వానీ, బంటీ వివేక్ సాహూ, అలోక్ శర్మ దూసుకెళ్తున్నారు. చింద్వాడలో నకుల్ కమల్‌నాథ్ వెనుకంజలో ఉన్నారు.

Similar News

News January 24, 2026

తెలుగు వెండితెర ‘కాంచనమాల’ వర్ధంతి నేడు

image

తెలుగు చలనచిత్ర తొలితరం అందాల తార చిట్టాజల్లు కాంచనమాల (1917–1981) వర్ధంతి నేడు. 1917, మార్చి 5న ఉమ్మడి గుంటూరు (D) అమృతలూరు(M) కూచిపూడిలో జన్మించారు. 1935లో ‘శ్రీకృష్ణ తులాభారం’తో తెరంగేట్రం చేసిన ఆమె, తన అద్భుత నటనతో ‘ఆంధ్రా గ్రేటా గార్భో’గా పేరు తెచ్చుకున్నారు. ‘మాలపిల్ల’ (1938) చిత్రం ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. గృహలక్ష్మి, వందేమాతరం, బాలనాగమ్మ వంటి చిత్రాల్లో ఆమె నటన చిరస్మరణీయం.

News January 24, 2026

పులిపిర్లకు ఇలా చెక్

image

వివిధ అనారోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. అవి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లు ఉన్న చోట అద్దితే పూర్తిగా తగ్గిపోతాయి. • ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. అలా రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.

News January 24, 2026

ఉద్యోగులకు షాక్.. డుమ్మా కొడితే ఇంటికే!

image

TG: డ్యూటీకి రెగ్యులర్‌గా రాని ప్రభుత్వ ఉద్యోగులపై సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. పర్మిషన్ లేకుండా ఏడాదికి మించి విధులకు దూరంగా ఉంటే నేరుగా సర్వీసు నుంచి తొలగించేలా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ‘తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్’ను మారుస్తూ CS ఉత్తర్వులు జారీ చేశారు. వరుసగా ఐదేళ్లు సెలవులో ఉన్నా, అనుమతి లేని ఫారిన్ సర్వీసులో కొనసాగినా వేటు తప్పదు. ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీస్ ఇస్తారు.