News September 26, 2025

అక్టోబర్ 1న OTTలోకి ‘మదరాసి’

image

శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన ‘మదరాసి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 5న థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

Similar News

News February 13, 2026

బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధరలు

image

AP: ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో <<19090331>>బర్డ్‌ ఫ్లూ బయటపడటంతో<<>> చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 రోజుల కిందటి వరకు కేజీ చికెన్ రూ.300పైనే ఉండగా ప్రస్తుతం రూ.160-180కి తగ్గింది. కాగా బర్డ్‌ఫ్లూ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. చికెన్, కోడి గుడ్లను 100 డిగ్రీలపైన వేడితో ఉడికించి తింటే ప్రమాదం లేదంటున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 13, 2026

దేశవ్యాప్తంగా సిట్టింగ్ జడ్జిలపై 8,630 ఫిర్యాదులు

image

గత దశాబ్ద కాలంలో సిట్టింగ్ జడ్జిలపై భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి 8,630 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది. ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2024లో మాజీ CJI చంద్రచూడ్, మాజీ CJI సంజీవ్ ఖన్నా పదవీ కాలంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపింది. పదేళ్ల గణాంకాలు చూస్తే ఎక్కువగా 2022లో 1,012, 2023లో 977, 2024లో 1,170, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయంది.

News February 13, 2026

ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్!

image

AP: చేనేతలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు శాసనమండలిలో వెల్లడించారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640, మర మగ్గం నేతన్నలకు రూ.21,600 ఆదా కానుందని మంత్రి చెప్పారు.