News March 18, 2024
ఈ నెల 26న ‘మగధీర’ రీరిలీజ్!
రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కి సంచలనం సృష్టించిన మూవీ ‘మగధీర’. 2009లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్లో రికార్డులను తిరగరాసింది. ఈ నెల 26న చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మరోసారి ఈ మాస్టర్ పీస్‌ను చూసే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
Similar News
News October 31, 2024
2 నుంచి ఏపీలో కొత్త కార్యక్రమం
AP: రాష్ట్రంలో వచ్చే నెల 2 నుంచి ‘మిషన్ పాట్‌హోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరంభిస్తోంది. సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా ఎస్.కోటలో రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రోడ్లకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు, గుంతలు పూడ్చడం, కల్వర్టుల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ఇందుకోసం రూ.860 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. జనవరి నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించింది.
News October 31, 2024
దీపావళి: ఈ జాగ్రత్తలు మరవకండి
* లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే క్రాకర్స్ కొనండి.
* వాహనాల దగ్గర, కరెంట్ వైర్ల కింద, డ్రైనేజీ సమీపంలో బాణసంచా కాల్చడం ప్రమాదకరం.
* గాలి వీచే సమయంలో రాకెట్ల వంటి పైకి ఎగిరే టపాసులు కాల్చకండి.
* కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్లో వేయండి.
* ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలున్న వారు టపాసులకు దూరంగా ఉండండి. నాణ్యమైన మాస్క్‌లు ధరించండి.
> SHARE
News October 31, 2024
స్థలం, రేషన్‌కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు?
TG: దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది సొంత స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇల్లు ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ నిబంధన వల్ల ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇస్తే 30లక్షల దరఖాస్తులు బుట్టదాఖలు కావాల్సి ఉంటుంది.