News October 6, 2025

మ్యాగజైన్ కంటెంట్.. ఇక ప్రతిరోజూ..

image

Way2News యునిక్ ఫీచర్లలో ఒకటైన మ్యాగజైన్‌కు విశేష ఆదరణ ఉంది. వసుధ, పాడిపంట, భక్తి, జాబ్స్.. ఇలా వారంలో రోజూ ఒక్కో థీమ్‌తో అందించే కంటెంట్‌ను ప్రతిరోజూ ఇవ్వాలని కొత్తగా కేటగిరీలు తీసుకొచ్చాము. దీంతో మీరు మెచ్చిన కంటెంట్ కోసం వారం రోజులు వేచి చూడకుండా ప్రతిరోజూ చదువుకోవచ్చు. యాప్‌లో కింద భాగంలో కేటగిరీలు క్లిక్ చేసి నేరుగా నచ్చిన కంటెంట్ పొందండి. కేటగిరీలు కన్పించలేదంటే <>యాప్ అప్డేట్<<>> చేసుకోండి.

Similar News

News October 6, 2025

విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: లోకేశ్

image

ముంబై పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలని రహేజా గ్రూప్‌ను కోరారు. అమరావతిలో ప్రీమియం అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించాలని కోరారు. అంతకుముందు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయిన లోకేశ్.. సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.

News October 6, 2025

ట్రయథ్లాన్‌ అంబాసిడర్‌గా సయామీఖేర్

image

బాలీవుడ్‌ నటి, అథ్లెట్‌ సయామీ ఖేర్‌‌ ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ ట్రయథ్లాన్‌కు అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఏడాదిలోపు రెండుసార్లు ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ ట్రయథ్లాన్‌ పూర్తి చేసినందుకుగానూ ఐరన్‌మ్యాన్‌ ఇంటర్నేషనల్‌ కమిటీ ఆమెను ఎంపిక చేసింది. ఇందులో ఈత(1.9 KM), సైక్లింగ్‌(90 KM), పరుగు(21.1 KM) పోటీల్లో వరుసగా పాల్గొనాలి. గతేడాది సెప్టెంబరులో తొలిసారి, ఈ ఏడాది జులైలో రెండోసారి సయామీ సత్తాచాటి పతకం అందుకున్నారు.

News October 6, 2025

స్థానిక సంస్థల్లో BCలకు 34% కోటాపై CBN ఆదేశాలు

image

AP: BCలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేలా భారీగా నిధులు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదని CM CBN అన్నారు. అందరికీ సమానంగా సంక్షేమ ఫలాలు దక్కేలా చూడాలని అధికారులకు సంక్షేమ సమీక్షలో సూచించారు. కులవృత్తుల్లో ఆధునీకరణతోనే ఆయా వర్గాలు ఎక్కువ ఆదాయాన్ని పొందగలవని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.