News October 9, 2025

మ్యాగజైన్ కంటెంట్.. ఇక ప్రతిరోజూ..

image

Way2News యునిక్ ఫీచర్లలో ఒకటైన మ్యాగజైన్‌కు విశేష ఆదరణ ఉంది. భక్తి, జాబ్స్, పాడిపంట, వసుధ.. ఇలా వారంలో రోజూ ఒక్కో థీమ్‌తో అందించే కంటెంట్‌ను ప్రతిరోజూ ఇవ్వాలని కొత్తగా కేటగిరీలు తీసుకొచ్చాము. దీంతో మీరు మెచ్చిన కంటెంట్ కోసం వారం రోజులు వేచి చూడకుండా ప్రతిరోజూ చదువుకోవచ్చు. యాప్‌లో కింద భాగంలో కేటగిరీలు క్లిక్ చేసి నేరుగా నచ్చిన కంటెంట్ పొందండి. కేటగిరీలు కన్పించలేదంటే <>యాప్ అప్డేట్<<>> చేసుకోండి.

Similar News

News October 9, 2025

22 ఏళ్ల సినీ ప్రయాణం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

image

‘లేడీ సూపర్ స్టార్’ నయనతార సినీ పరిశ్రమలోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘మొదటి సారి కెమెరా ముందు నిల్చొని 22 ఏళ్లయింది. సినిమాలే ప్రపంచమవుతాయని నాకు తెలియదు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్, ప్రతి మౌనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా నన్ను తీర్చిదిద్దాయి’ అని పేర్కొన్నారు. ఈ బ్యూటీ 2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

News October 9, 2025

ముగ్గురితో మొదలై 11వేలమందితో పయనం

image

మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్ ట్వీట్లతో వార్తల్లోకెక్కిన ZOHO, దాని ఫౌండర్ శ్రీధర్‌పై చర్చ జరుగుతోంది. TN లో పేదింట పుట్టిన ఆయన మద్రాస్ IIT, ప్రిన్స్‌టన్ (US)లలో చదివారు. ‘క్వాల్కమ్’ లో పనిచేశారు. 1996లో ఇండియా వచ్చి ‘అడ్వెంట్ నెట్’ స్థాపించారు. అదే జోహోగా మారింది. ముగ్గురితో స్టార్టై ఇపుడు 11000 మందితో ₹1.03లక్షల కోట్లకు ఎదిగింది. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2021లో పద్మశ్రీ అందించింది.

News October 9, 2025

హర్షిత్ సెలక్షన్ వెనక లాజిక్ ఏంటో: అశ్విన్

image

టీమ్ ఇండియాలోకి హర్షిత్ రాణాను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ స్పందించారు. ‘హర్షిత్‌ సెలక్షన్ వెనకున్న లాజిక్ ఏంటో తెలియదు. అతడిని ఎందుకు తీసుకున్నారో నాకూ తెలుసుకోవాలనుంది. AUSలో బ్యాటింగ్ కూడా చేయగలిగిన బౌలర్ అవసరం. హర్షిత్ బ్యాటింగ్ చేస్తాడని వాళ్లు భావించి ఉండొచ్చు. అతడు అర్హుడా అని నన్నడిగితే.. సందేహించాల్సిన విషయమే’ అని చెప్పారు.