News September 22, 2024
ప్యూరిఫైడ్ వాటర్తో మెగ్నీషియం లోపం?

మెగ్నీషియం మన నరాల వ్యవస్థ పనితీరుకు, డయాబెటిస్, ఇస్కీమిక్ స్ట్రోక్ నివారణకు అత్యవసరం. ప్రకృతిసిద్ధంగా లభించే నీటిలో 10-20 శాతం మేర మెగ్నీషియం ఉంటుంది. కానీ నేడు వాడుతున్న ప్యూరిఫైడ్ లేదా మినరల్ వాటర్లో అన్ని మినరల్స్ను తొలగిస్తున్నారని ఇజ్రాయెల్ పరిశోధకులు తెలిపారు. దీంతో నీటి ద్వారా లభించాల్సిన మెగ్నీషియం మనకు అందడం లేదని, మినరల్ వాటర్ మృతజలాలతో సమానమని తాజా నివేదికలో హెచ్చరించారు.
Similar News
News December 9, 2025
మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.
News December 9, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.1,30,090కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పతనమై రూ.1,19,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,99,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 9, 2025
NIT వరంగల్లో 45పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

<


