News March 16, 2024
వందలాది కార్లతో ర్యాలీగా బయలుదేరిన మాగుంట

ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శనివారం తాడేపల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు నుంచి వందలాది కార్లతో తన అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. తాడేపల్లి బయలుదేరి వెళ్లారు.
Similar News
News September 16, 2025
ప్రకాశం: డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ శుభవార్త చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా స్కాలర్షిప్ పొందేందుకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీ నుంచి పీజీ వరకు విద్యను అభ్యసించే విద్యార్థులు ఈనెల 30లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు.
News September 16, 2025
మార్కాపురం: రూ.25 వేల జీతంతో జాబ్స్

మార్కాపురంలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 19వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. 10 జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని, పది నుంచి పీజీ వరకు పూర్తి చేసిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ. 25వేల వరకు జీతం అందుతుందన్నారు.
News September 16, 2025
ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో నాలుగో విడత ప్రవేశాలకు కన్వినర్ ప్రసాద్ బాబు మంగళవారం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఒకటికంటే ఎక్కువ ITIలను ఎంపిక చేసుకోవచ్చని, ప్రభుత్వ ITIలలో 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.