News November 11, 2024
జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ

12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 13(పుష్య పూర్ణిమ) నుంచి ఫిబ్రవరి 26(శివరాత్రి) వరకు వైభవంగా కొనసాగనుంది. హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలలోనూ కుంభమేళాను జరపనున్నారు. దేశవిదేశాల నుంచి లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది సాధువులు, అఘోరాలు రానుండటంతో అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు.
Similar News
News December 3, 2025
తూప్రాన్: ఈ ఒక్క దరఖాస్తు తీసుకోండి సారూ..!

తూప్రాన్ పట్టణంలో నామినేషన్ల చివరి రోజు ఆఖరి క్షణంలో వచ్చిన ఓ అభ్యర్థి సారూ.. నా నామినేషన్ తీసుకోమంటూ కనిపించిన వారినందరినీ అభ్యర్థించారు. మండలంలోని ఇస్లాంపూర్‌కు చెందిన గొల్ల కిష్టయ్య చివరి క్షణంలో నామినేషన్ వేసేందుకు నిశ్చయించి, రెండు నిమిషాల ముందు వచ్చాడు. నామినేషన్ పత్రాలు పూరించినప్పటికీ సమయం గడిచిపోయింది. నామినేషన్ పత్రాలు పట్టుకొని సార్.. ఈ ఒక్క నామినేషన్ తీసుకోండి అంటూ వేడుకున్నారు.
News December 3, 2025
ఏపీ న్యూస్ అప్‌డేట్స్

*ధాన్యం సేకరణలో రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు
*పోలవరం ప్రధాన డ్యామ్‌లో రూ.543 కోట్లతో చేపట్టే అదనపు పనులకు ప్రభుత్వం అనుమతి
*విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగుల జీతాల్లో కోత. 100% ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటన. నేడు నిరసనకు కార్మికుల పిలుపు
*హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ డిమాండ్
News December 3, 2025
పశువుల్లో పాల ఉత్పత్తిని మరింత పెంచే గడ్డి ఇది

పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు చాలా మంది పాడి రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసం వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పశువుల్లో పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం’ అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. ఈ పశుగ్రాసం సాగు, ప్రత్యేకతల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


