News January 14, 2025

మహా కుంభమేళా: స్టీవ్ జాబ్స్ భార్యకు అలర్జీ

image

మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన ఆపిల్ కంపెనీ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ భార్య పావెల్ (61) అనారోగ్యానికి గురైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. భారీ జన సందోహం మధ్య నదిలో స్నానం చేయడంతో అలర్జీలు వచ్చినట్లు తెలిపింది. కాగా నిరంజని అఖారా సూచనతో పావెల్ ఇండియాకు వచ్చి, మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఆమెకు ఆ స్వామీజి ‘కమల’ అని నామకరణం చేశారు. పావెల్ భారత సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తున్నారని ఆయన చెప్పారు.

Similar News

News December 5, 2025

నిజామాబాద్: 1,543 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా 2వ రోజైన గురువారం 1,543 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 294 మంది, 1,620వార్డు మెంబర్ స్థానాలకు 1,249 మంది నామినేషన్లు వేశారు.

News December 5, 2025

జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

image

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్‌లను సంప్రదించాలి.

News December 5, 2025

గూగుల్ డేటా సెంటర్‌కు 480 ఎకరాలు

image

AP: విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు 480 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ(D)లోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి(D)లోని రాంబిల్లిలో భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. గూగుల్ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న అదానీ ఇన్‌ఫ్రా పేరున కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశల వారీగా వెయ్యి మెగా వాట్ల ఏఐ డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయనుంది.