News July 28, 2024

గోదావరి, కృష్ణా నదుల మహోగ్రరూపం

image

గోదావరి, కృష్ణా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 15.3 అడుగులకు చేరింది. 15.33 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 873 అడుగులుగా ఉంది. రేపు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Similar News

News November 20, 2025

అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

image

డాలర్‌కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్‌కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.

News November 20, 2025

ఓట్ చోర్, SIRపై సందేహాలను నివృత్తి చేయాలి: మాజీ సీఈసీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్, SIR ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ సీఈసీ ఖురేషి తెలిపారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, ప్రత్యారోపణలు చేయడం సరైనది కాదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2010-12 మధ్య ఖురేషీ సీఈసీగా పని చేశారు.

News November 20, 2025

రాజమౌళి సినిమాలు ఆపేస్తాం.. VHP వార్నింగ్

image

హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా అని VHP నేత తనికెళ్ల సత్యకుమార్ ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తామని, డబ్బు గర్వంతో మాట్లాడితే VHP క్షమించదని స్పష్టం చేశారు. కాగా రాజమౌళి కామెంట్స్‌‌‌ను ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు సైతం ఖండించారు.