News February 26, 2025

మహాకుంభమేళా ‘సిత్రాలు’

image

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు, నాగ సాధువులు, అఘోరాలు పుణ్య స్నానమాచరించారు. ఈ క్రమంలో పలు ఫొటోలు వైరలయ్యాయి. పైన స్వైప్ చేసి ఫొటోలను చూడొచ్చు.

Similar News

News February 26, 2025

కాంగోలో వింతవ్యాధి: సోకిన 48 గంటల్లోపే మరణం

image

కాంగో దేశాన్ని ఓ వింత వ్యాధి 5 వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంతో ప్రజలు చచ్చిపోతున్నారు. ఈ లక్షణాలు ఎబోలా, డెంగ్యూ, మార్‌బర్గ్, యెల్లో ఫీవర్‌ను పోలివుండటంతో WHO సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం బొలొకొ గ్రామంలో గబ్బిలాలను తిన్న ముగ్గురు పిల్లలు 48 గంటల్లోపే చనిపోవడంతో ఔట్‌బ్రేక్ మొదలైంది. 419 మందికి సోకింది. 53 మందిని చంపేసింది.

News February 26, 2025

క్రికెటే నా ప్రాణం: రోహిత్‌ శర్మ

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అంటే తనకు ప్రాణమని తాను బతికేదే ఆటకోసమని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫిలో ఇండియా సెమీస్ చేరటంపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశారు. కోహ్లీ అంటే తనకెంతో ఇష్టమని.. ఇండియా విజయం కోసం అతను దేనికైనా సిద్ధంగా ఉంటాడని తెలిపారు. ప్రస్తుతం కప్పు గెలవటం పైనే తన పూర్తి ఫోకస్ ఉందని హిట్‌మ్యాన్ వివరించారు.

News February 26, 2025

స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్

image

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే TNతో పాటు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆ రాష్ట్ర CM స్టాలిన్ వ్యాఖ్యలను KTR సమర్థించారు. దేశానికి అవసరమైనప్పుడు ఈ రాష్ట్రాలే కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయని చెప్పారు. దేశాభివృద్ధిలో వీటి కృషిని గుర్తించకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. దేశానికి ఆర్థిక తోడ్పాటు అందించే రాష్ట్రాల ఆధారంగా పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!