News November 30, 2024
చైనాలో ‘మహారాజ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ₹15 కోట్లు!

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా నిన్న చైనాలో రిలీజైంది. ఆ దేశవ్యాప్తంగా మొత్తం 40,000+ స్క్రీన్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వస్తోందని సినీవర్గాలు తెలిపాయి. తొలిరోజు ఈ మూవీ రూ.15 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో రూ.100కోట్ల మార్క్ దాటిన విషయం తెలిసిందే.
Similar News
News February 4, 2026
మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ: మంత్రి

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టులను మార్చిలోపు భర్తీ చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు జిల్లాకో అధికారిని నియమించాలని సూచించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెలగపూడి సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
News February 4, 2026
చిక్కుల్లో ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ పబ్లిష్ కాని ఈ బుక్ కాపీ రాహుల్ గాంధీ చేతిలో కనిపించడంతో వివాదం మరింత ముదిరింది. చైనాతో ఉద్రిక్తతలపై ఇందులో రాశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ప్రచురించని పుస్తకంలో ఉన్న వాటిని లేవనెత్తడం దేశ భద్రతకు ముప్పని కేంద్రం అంటోంది. రక్షణ శాఖ అనుమతులు రాకపోవడంతో 2023 నుంచి ఇది ప్రచురణ కాలేదు.
News February 4, 2026
U19 WC: భారత్ రికార్డు

అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్ డామినేషన్ కొనసాగుతోంది. టీమ్ ఇండియా ఫైనల్ చేరడం U19 WC చరిత్రలో ఇది పదో సారి. దీంతో మొత్తం 16 ఎడిషన్లలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇవాళ SF-2లో AFGపై 311 పరుగులు ఛేదించగా, U19 WC హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్. మరోవైపు వరుసగా 6 ఎడిషన్లలో (2016, 18, 20, 22, 24, 26) భారత్ ఫైనల్ చేరడం విశేషం.


