News November 16, 2024
చైనాలో ‘మహారాజ’ రిలీజ్

విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించిన రివేంజ్ డ్రామా ‘మహారాజ’ ఈ నెల 29న చైనాలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ నిథిలన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 14న విడుదలై సంచలన విజయం సాధించింది. రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ రికార్డుస్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.
Similar News
News January 7, 2026
వివాహ ఆటంకాలను తొలగించే సర్ప దోష నివారణ

జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో రాహువు లేదా కేతువు ఉన్నప్పుడు సర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతుంటాయి. ఈ దోష నివారణకు కాళహస్తి వంటి క్షేత్రాల్లో రాహు-కేతు శాంతి పూజ చేయించుకోవడం ఉత్తమం. ఇంట్లో రోజూ దుర్గా చాలీసా పఠిస్తే రాహువు ప్రభావం తగ్గుతుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.
News January 7, 2026
25 రన్స్ చేస్తే సచిన్‌ను దాటనున్న కోహ్లీ!

ఈ నెల 11న ప్రారంభమయ్యే NZతో వన్డే సిరీస్‌లో సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశాలున్నాయి. మరో 25 పరుగులు చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లో వేగంగా 28వేల పరుగులకు చేరుకున్న క్రికెటర్‌గా నిలవనున్నారు. కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్‌లో 27,975 రన్స్ చేశారు. మరోవైపు 28వేల రన్స్ మైలురాయిని అందుకోవడానికి సచిన్‌కు 644 ఇన్నింగ్స్ అవసరం కాగా, సంగక్కర 666 ఇన్నింగ్స్ ఆడారు.
News January 7, 2026
US బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ వేళ US ఆర్మీ చేసిన మెరుపుదాడిలో 55 మంది వెనిజులా, క్యూబా సైనికులు చనిపోయినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. వీరిలో వెనిజులాకు చెందిన 23, క్యూబా సైనికులు 32మంది ఉన్నట్లు పేర్కొన్నాయి. మృతిచెందిన తమ సైనికుల వయసు 26-27ఏళ్ల మధ్య ఉంటుందని క్యూబా చెప్పింది. అటు ఈ దాడుల్లో మదురో భద్రతా సిబ్బంది చాలా వరకు చనిపోయినట్లు వెనిజులా రక్షణ మంత్రి పాడ్రినో లేపెజ్ తెలిపారు.


