News November 20, 2024
చైనాలో 40వేల స్క్రీన్లలో రిలీజవుతున్న ‘మహారాజ’

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం చైనాలో రిలీజ్కు సిద్ధమైంది. చైనా వ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ స్క్రీన్లలో ఈనెల 29న విడుదల కానుంది. దీంతో చైనాలో అత్యధిక థియేటర్లలో విడుదలైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా ‘మహారాజ’ నిలువనుంది. మరి ఏ స్థాయి కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
Similar News
News January 9, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 9, 2026
OTTలోకి కొత్త సినిమాలు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ ఈరోజు నుంచి Netflixలో 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అటు మురళీ మనోహర్ డైరెక్షన్లో నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘గుర్రం పాపిరెడ్డి’ ఈ నెల 16న ZEE5లోకి రానుంది. మరోవైపు శోభితా ధూళిపాళ్ల నటించిన ‘చీకటిలో’ సినిమా ఈ నెల 23న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. దీనికి శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.
News January 9, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 9, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.22 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.15 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


