News March 16, 2025

మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు కన్నుమూత

image

రాజవంశీకుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు అర్వింద్ సింగ్ మేవార్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ రాజస్థాన్‌లోని సిటీ ప్యాలెస్‌లో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రంజీల్లో రాజస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించారు. పూర్వీకుల ఆస్తులపై న్యాయపోరాటం చేస్తూ మేవార్ ఫ్యామిలీ ఇటీవల వార్తల్లో నిలిచింది. రేపు అర్వింద్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

Similar News

News December 29, 2025

సైన్యంలో అవినీతి.. టాప్ జనరల్స్‌పై వేటు వేసిన జిన్‌పింగ్

image

చైనా సైన్యంలో అగ్రశ్రేణి అధికారులే అవినీతికి పాల్పడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా ముగ్గురు కీలక సైనిక అధికారులపై పార్లమెంట్ బహిష్కరణ వేటు వేసింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ విభాగాల అధిపతులు వాంగ్ రెన్‌హువా, వాంగ్ పెంగ్‌తో పాటు ఆర్మ్‌డ్ పోలీస్ అధికారి జాంగ్ హాంగ్‌బింగ్‌ను పదవుల నుంచి తొలగించారు. సైన్యంలో ప్రక్షాళనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

News December 29, 2025

NHIDCLలో 48 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (<>NHIDCL<<>>)లో 48 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, Sr జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ టెస్ట్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

News December 29, 2025

గిల్ చాలా బద్ధకస్తుడు.. కోహ్లీలా ఆడలేడు: పనేసర్

image

టీమ్‌ఇండియా వన్డే & టెస్ట్ కెప్టెన్ గిల్‌ చాలా బద్ధకస్తుడని, కోహ్లీలా దూకుడుగా ఆడలేడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ విమర్శించారు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం అతనికి భారమని అన్నారు. టెస్టుల్లో నిలదొక్కుకోవాలంటే దేశవాళీ క్రికెట్ బలోపేతం కావాలని సూచించారు. ప్లేయర్లు కేవలం IPL కాంట్రాక్టుల కోసమే ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కోహ్లీ లేకపోవడంతో జట్టులో ఆ తీవ్రత కనిపించడం లేదన్నారు.