News December 15, 2024
సాయంత్రం మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. BJP, శివసేన, NCPల మధ్య 39 శాఖలపై ఏకాభిప్రాయం కుదిరింది. సాయంత్రం నాగ్పూర్లో మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. NCPకి ఆర్థిక శాఖ, కోఆపరేటివ్, క్రీడా శాఖలు, శివసేనకు పట్టణాభివృద్ధి, ఆరోగ్య, పర్యాటక శాఖలు దక్కనున్నట్టు సమాచారం. హోం, రెవెన్యూ BJP అట్టిపెట్టుకోనుంది. BJPకి దక్కిన 20 పదవుల్లో ఈ రోజు కొందరే ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Similar News
News November 25, 2025
మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

AP: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలోని వన్ స్టాప్ సెంటర్లో 4 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://ananthapuramu.ap.gov.in/
News November 25, 2025
ఈ నెల 28న ఓటీటీలోకి ‘మాస్ జాతర’

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ మూవీ OTTలోకి రానుంది. ఈ నెల 28 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
News November 25, 2025
ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>


