News October 19, 2024

మహారాష్ట్ర ఎన్నికలు: FB, X, INSTAకు నోటీసులు

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లను తికమకపెట్టేలా ఉన్న 1752 ఫేక్‌న్యూస్ పోస్టులను తొలగించాలని ఆదేశించామంది. ఇప్పటి వరకు FB 16, INSTA 28, X 251, YT 5 పోస్టులను డిలీట్ చేసినట్టు వెల్లడించింది. కోడ్ ఉల్లంఘనపై c-VIGIL యాప్ ద్వారా 420 ఫిర్యాదులు రాగా 414 పరిష్కరించామని తెలిపింది. రూ.10.64కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, లిక్కర్ సీజ్ చేశామంది.

Similar News

News October 17, 2025

అది కల్తీ మద్యమే: ల్యాబ్ నివేదిక

image

AP: NTR(D) ఇబ్రహీంపట్నంలో జనార్దన్‌రావు విక్రయించిన మద్యం కల్తీదే అని తేలింది. అది అత్యంత ప్రమాదకరమైంది కాకపోయినా నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు లేవని ల్యాబ్ రిపోర్ట్స్ తేల్చాయి. 25గా ఉండాల్సిన UP(అండర్ ప్రూఫ్) 35గా, అలాగే 75గా ఉండాల్సిన OP(ఓవర్ ప్రూఫ్)65గా ఉన్నట్లు గుర్తించాయి. మద్యం తయారీలో నాణ్యత, గాఢతలను UP, OP తెలియజేస్తాయి. ఈ కేసులో ఇప్పటికే జనార్దన్‌రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

News October 17, 2025

దీపావళి బోనస్.. నేడే అకౌంట్లలో రూ.లక్ష జమ

image

తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఇవాళ దీపావళి బోనస్ అందనుంది. పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు(PLR) కింద బొగ్గు సంస్థలు ఒక్కో కార్మికుడికి రూ.1.03 లక్షల చొప్పున అకౌంట్లలో జమ చేయనున్నాయి. ఇప్పటికే ఈనెలలో దసరా సందర్భంగా రూ.1.95 లక్షల చొప్పున కార్మికులకు ప్రభుత్వం కానుక ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ దీపావళి బోనస్ రానుండటంతో వారి ఆనందం రెట్టింపు కానుంది.

News October 17, 2025

చిన్న వయసులోనే తల నెరుస్తోందా?

image

చర్మంలో మెలనిన్‌ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఇది వృద్ధాప్యచిహ్నం. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే తల నెరుస్తోంది. హార్మోనుల్లో అసమతుల్యత, అనారోగ్యకర జీవన శైలి, కాలుష్యం, రసాయనాలున్న, సింథటిక్‌ షాంపూలు వాడటం దీనికి కారణం అంటున్నారు నిపుణులు. గోధుమ, పెరుగు, టొమాటో, అరటి, చిరుధాన్యాలు, గుడ్డు, చేప, సీఫుడ్‌, సోయాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.