News November 16, 2024
మహారాష్ట్ర: ఆ 87 సీట్లలో Total Confusion
MH ఎన్నికల్లో 87 చోట్ల ఏది అసలైన పార్టీయో తెలియక ప్రజలు గందరగోళంలో ఉన్నారు. NCP, శివసేన చీలిపోవడంతో కొత్తగా NCP SP, శివసేన UBT ఏర్పడ్డాయి. ఇప్పుడీ 4 పార్టీలు 2 కూటముల్లో ఉన్నాయి. అలా 51 సీట్లలో శివసేన షిండే వర్గం-శివసేన ఉద్ధవ్ వర్గం పోటీపడుతున్నాయి. 36 చోట్ల NCP అజిత్ వర్గం-NCP శరద్ పవార్ వర్గాలు బరిలో ఉన్నాయి. ఈ 87 చోట్ల ఎవరిది ఏ పార్టీయో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ అరుదైన ఫొటోలు.. గ్యాలరీ
మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్(92) తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. మన్మోహన్ అరుదైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
News December 27, 2024
10 ఏళ్లు ప్రధాని.. రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు
తనకు రూ.15.77 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని మన్మోహన్ సింగ్ 2018లో రాజ్యసభ సీటుకు నామినేషన్ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, చండీగఢ్లో రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు, SBI, పోస్టల్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ సమర్పించారు. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం.
News December 27, 2024
మన్మోహన్ మృతి.. ఇవాళ సెలవు
TG: మాజీ ప్రధాని మన్మోహన్ మృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. వారం రోజులపాటు సంతాప దినాలుగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులిచ్చారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది.