News August 9, 2025

‘మహావతార్ నరసింహ’.. రూ.136 కోట్లకు పైగా వసూళ్లు

image

యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ విడుదలై రెండు వారాలైనా బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తోంది. అన్ని భాషల్లో కలిపి 14 రోజుల్లో రూ.136 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం హిందీలోనే రూ.84.44Cr నెట్ కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో తొలి వారం ₹ 32.82cr, రెండో వారంలో అంతకుమించి ₹51.62cr వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు.

Similar News

News August 9, 2025

పెరుగుతున్న ఎండు మిర్చి ధర

image

TG: ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లో ఎండు మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే అన్ని రకాల మిర్చి క్వింటాల్‌కు రూ.500 పెరిగింది. ఖమ్మం మార్కెట్‌లో నాణ్యమైన తేజా రకం క్వింటాల్‌కు రూ.14,500 వరకు పలుకుతోంది. సగటు ధరలు రూ.13,500 నుంచి రూ.14వేల మధ్యలో ఉన్నాయి. విదేశాలకు ఎగుమతులు పెరగడం, మిర్చి లభ్యత తగ్గడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News August 9, 2025

నేడు రాఖీ పౌర్ణమి.. ఇలా చేయండి

image

లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి(నేడు)రోజున రాఖీ జరుపుకుంటాం. ఈ రోజు ఉ.9 గంటల నుంచి 10.30 వరకు రాఖీ కట్టడానికి సుముహూర్తం ఉంది. ఉదయాన్నే తల స్నానం చేసి దీపం వెలిగించాలి. పళ్లెంలో రాఖీ, వెండి నాణెం ఉంచి పూజ చేయాలి. అక్కాచెల్లెళ్లు తమ సోదరుడికి రాఖీ కట్టి, హారతి ఇచ్చి, అక్షింతలు వేసి మిఠాయి తినిపించాలి. సోదరులు ప్రేమతో వారికి కానుకలు ఇవ్వాలి. కుటుంబ సంబంధాలను దృఢపరుచుకోవడమే ఈ పండుగ ఉద్దేశం.

News August 9, 2025

ఛార్జీలు పెంచలేదు: TGSRTC

image

TG: రాఖీ పండుగ సందర్భంగా RTC బస్సుల్లో ఛార్జీలు పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని, వాటిలో మాత్రమే 30% అదనపు ఛార్జీలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. రెగ్యులర్ బస్సుల్లో ఎలాంటి పెంపు లేదని పేర్కొంది. స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పండగలకూ ఈ విధానాన్నే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.