News August 14, 2025

‘మహావతార్ నరసింహ’కు భారీగా కలెక్షన్లు

image

యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ విడుదలై 20 రోజులైనా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.236.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.15కోట్లు, భారత్‌లో రూ.221.25 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఇవాళ రెండు పెద్ద సినిమాలు(వార్-2, కూలీ) విడుదలైనా బుక్ మై షోలో ఈ మూవీకి గంటకు 6.56k+ టికెట్లు బుక్ అవుతుండటం గమనార్హం.

Similar News

News August 14, 2025

తెర వెనుక పొత్తులకు బ్రాండ్ జగనే: షర్మిల

image

AP: మాజీ సీఎం జగన్‌ది నీతిమాలిన చరిత్ర అని పీసీసీ స్టేట్ చీఫ్ షర్మిల విమర్శించారు. తెర వెనుక పొత్తులకు ఆయన ఓ పెద్ద బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. ‘మోదీకి జగన్ వంగి వంగి దండాలు పెట్టారు. పార్లమెంట్‌లో ఆ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చారు. మోదీ, అమిత్ షాతో హాట్ లైన్ టచ్‌లో ఉన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే విమర్శలు చేస్తారా? మీదో పార్టీ.. మీరొక నాయకుడు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News August 14, 2025

3 దశాబ్దాల తర్వాత నచ్చినవారికి ఓటేశారు: పవన్

image

AP: మూడు దశాబ్దాల తర్వాత పులివెందులలో ఓటర్లు తమకు నచ్చిన వారికి ఓటేశారని Dy.CM పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో గెలిచినవారికి అభినందనలు తెలిపారు. ‘గతంలో అక్కడ నామినేషన్లు కూడా వేయనీయలేదు. వేద్దామనుకున్నవారిపై దాడులకు తెగబడ్డారు. ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి’ అని పేర్కొన్నారు.

News August 14, 2025

ALERT: కాసేపట్లో వర్షం

image

TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 1-2 గంటల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వాన పడుతుందని అంచనా వేసింది. అలాగే రాబోయే 2 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.