News April 9, 2025
మహావీర్ జయంతి: రేపు ఐచ్ఛిక సెలవు

రేపు మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలిడే ప్రకటించింది. అలాగే స్టాక్ మార్కెట్లకు సైతం హాలిడే ఉండనుంది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సైతం సెలవు ప్రకటించారు (ఏపీ, తెలంగాణలో లేదు). 24వ తీర్థంకరుడైన భగవాన్ మహావీర్ జన్మదినాన్ని మహావీర్ జయంతిగా జరుపుకుంటారు. ఈయన జైన మత విస్తరణకు విశేష కృషి చేశారు.
Similar News
News January 8, 2026
జిల్లా కేంద్రం మార్పుపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

AP: అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే అంశంలో స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంది. గతంలో ఓ మండలం మార్పులో హైకోర్టు జోక్యం చేసుకోగా సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తుచేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. జిల్లా కేంద్రం మార్పును సవాల్ చేస్తూ ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.
News January 8, 2026
శీతాకాలంలో గర్భిణులకు ఈ జాగ్రత్తలు

చలికాలంలో దాహం వేయట్లేదని నీరు తక్కువగా తాగుతారు. దీనివల్ల ఉమ్మనీరు తగ్గడంతో పాటు డెలివరీ తర్వాత పాలు కూడా తక్కువగా వస్తాయి. అలాగే గర్భిణులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి. సి విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరికాయలు, ఇతర పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు బచ్చలికూర, మెంతి ఆకు, ఉల్లిపాయ ఆకులు వంటి కూరగాయలు కూడా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 8, 2026
అసెంబ్లీకి రాని వైసీపీ MLAలకు నోటీసులు!

AP: అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగా వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. నిపుణుల అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు.


