News November 23, 2024
బ్యాలెట్ ఓట్లలో మహాయుతిదే పైచేయి
మహారాష్ట్రలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో అధికార మహాయుతి పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఆ కూటమి 76కు పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఇక ఈవీఎంలు ఇప్పుడే తెరిచారు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కనీసం 20-25 నిమిషాల సమయం పట్టనుంది. బారామతిలో ఇప్పటివరకు వెనుకంజలో ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మళ్లీ లీడింగ్‌లోకి వచ్చారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్‌లో ఫడణవీస్ ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News November 23, 2024
మహారాష్ట్రలో MVAను ముంచేసిన కాంగ్రెస్
మహారాష్ట్ర ఎన్నికల్లో MVA ఘోర పరాజయంలో కాంగ్రెస్‌దే ఎక్కువ బాధ్యత. ఎందుకంటే 288 స్థానాలున్న ఇక్కడ హస్తం పార్టీ 101 చోట్ల పోటీచేస్తే కేవలం 22 నియోజకవర్గాల్లోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కూటమి గెలవాలంటే ఎక్కువ సీట్లలో పోటీచేసిన పార్టీయే మరిన్ని విజయాలు అందుకోవాలి. అలాంటిది కాంగ్రెస్ స్ట్రైక్‌రేట్ ఇక్కడ 22కే పరిమితమైంది. ఇక శివసేన యూబీటీ 20/95, NCP SP 12/86తో చతికిలపడ్డాయి.
News November 23, 2024
తిలక్ వర్మ హ్యాట్రిక్ సెంచరీ
టీమ్ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ హ్యాట్రిక్ సెంచరీ బాదారు. SMATలో భాగంగా ఇవాళ మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ (151) సెంచరీ చేశారు. 67 బంతుల్లోనే ఆయన 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 151 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. కాగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో కూడా తిలక్ వరుస సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే. 3rd, 4th మ్యాచుల్లో ఆయన శతకాలు బాదారు.
News November 23, 2024
మరాఠ్వాడాలో మహాయుతి ప్రభంజనం.. ‘మరాఠా’ మనోజ్‌కు షాక్
మహారాష్ట్రలో మహాయుతి విజయంలో మరాఠ్వాడా కీలకంగా నిలిచింది. 46 సీట్లున్న బీజేపీ, శివసేన, NCP 32+ నియోజకవర్గాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం నడిపిన మనోజ్ జరంగేకు ఇది భారీ షాకే. ఆయన మొదట MVAకు మద్దతిచ్చారు. తర్వాత సొంతంగా కొందరిని పోటీకి నిలుపుతామన్నారు. కాంగ్రెస్ కూటమి ఓట్లు చీలొద్దని తర్వాత మానుకున్నారు. ఈ విజయంతో మహాయుతిని ఆయనిక బ్లాక్మెయిల్ చేయలేరని విశ్లేషకుల అంచనా.