News October 11, 2024
ఎన్నికల వేళ ‘మహాయుతి’ కీలక నిర్ణయం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాన్ క్రీమిలేయర్ పరిమితిని పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం ఉన్న₹8 లక్షల పరిమితిని ₹15 లక్షలకు పెంచాలని క్యాబినెట్ ప్రతిపాదించింది. హరియాణా ఎన్నికలకు ముందు కూడా BJP క్రీమిలేయర్‌ను ₹6 లక్షల నుంచి ₹8 లక్షలకు పెంచింది. ఇది బీజేపీకి ఎన్నికల్లో లాభం చేయడంతో మహారాష్ట్రలో కూడా అదే ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.
Similar News
News October 29, 2025
భరత్ పోరాటం వృథా.. ఓడిన తెలుగు టైటాన్స్

PKL సీజన్-12లో పుణేరి పల్టాన్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో తెలుగు టైటాన్స్ 45-50 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫస్టాఫ్‌లో టైటాన్స్ ఆధిక్యంలో నిలిచినా సెకండాఫ్‌లో పుణేరి పుంజుకుంది. భరత్ 23 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా TT డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించలేకపోయారు. ఓటమితో తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టగా పుణే ఫైనల్ చేరింది. ఎల్లుండి దబాంగ్ ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.
News October 29, 2025
ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశం

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్, విద్యాశాఖ సహకారంతో ఈ తనిఖీలు చేపట్టనుంది. మరోవైపు బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేయాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.
News October 29, 2025
సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ₹10 కోట్లు

AP: సత్యసాయి శతజయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇతర ఏర్పాట్లకోసం ₹10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. NOV 23న పుట్టపర్తిలో దీన్ని నిర్వహిస్తారు. కాగా దీనిపై దాఖలైన PILను హైకోర్టు విచారించింది. పలు సేవలందించిన వారిని స్మరించుకోవడంలో తప్పులేదంది. పిల్‌ను వెనక్కు తీసుకోవాలని సూచించడంతో పిటిషనర్ ఉపసంహరించుకున్నారు.


