News October 21, 2024
మహారాష్ట్రలో మహాయుతి ‘మోదీ ఫ్యాక్టర్’!

మహారాష్ట్రలో CM అభ్యర్థి ఎవరన్నది పక్కనపెట్టి ఈసారి అసెంబ్లీ ఎన్నికలను PM మోదీ పేరుతోనే ఎదుర్కొనబోతున్నట్టు మహాయుతి నేతలు చెబుతున్నారు. NDA కూటమిలోని BJP, శివసేన, NCPల పరస్పర అజెండాలు ప్రజల్లోకి వెళ్లకుండా మోదీ ఫ్యాక్టర్ మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. 3 పార్టీల్లో ఎవరికి CM హామీ ఇచ్చినా మిగిలిన పార్టీల క్యాడర్ పనిచేయదనే భావనలో నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
Similar News
News November 21, 2025
ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ గంభీర్‌కు ఊరట

భారత్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారని గంభీర్, కుటుంబ సభ్యులు, ఛారిటబుల్ ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.
News November 21, 2025
ఆముదంతో ఎన్నో లాభాలు

చాలామంది ఇళ్లల్లో లభించే ఆముదం నూనెలో ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇది వాడటం వల్ల జుట్టుకు అవసరమైన పూర్తి పోషణ అందుతుంది. జుట్టు రాలడం, చిట్లి పోవడం తగ్గి, కుదుళ్లు బలపడతాయి. ఎక్కువ జిడ్డుగా ఉంటుందని చాలామంది దీన్ని వాడటం మానేస్తారు. కానీ జుట్టు పెరగాలని కోరుకునేవారు ఆముదం నూనె ఎంచుకోవచ్చు.
News November 21, 2025
కృష్ణా జలాలపై జగన్ హెచ్చరిక

AP: కృష్ణా జలాల విషయంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందని YCP అధినేత YS జగన్ ట్వీట్ చేశారు. CM చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపైనే రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే KWDT-II విచారణలో తెలంగాణ 763 TMCలను డిమాండ్ చేస్తోందని, బచావత్ ట్రైబ్యునల్ APకి కేటాయించిన 512 TMCల్లో ఒక్క చుక్కనూ కోల్పోకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు.


