News April 1, 2024

మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఈసీ వాయిదా వేసింది. రేపు కౌంటింగ్ జరగాల్సి ఉండగా, పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. మార్చి 28న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.

Similar News

News April 15, 2026

‘AMARAVATHI’ కాదు ‘AMARAVATI’

image

AP: రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో తప్పుడు స్పెల్లింగ్‌ వినియోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎలా వాడాలో సూచిస్తూ CS సర్క్యులర్ జారీచేశారు. 2015లో ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ‘AMARAVATI’ని ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే కలెక్టర్లు, ఇతర అధికారులు నివేదికల్లో అమరావతిని ఇంగ్లిష్‌లో ‘AMARAVATHI’ అని రాస్తున్నారని పేర్కొంది. ఇకపై ‘AMARAVATI’ అని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.

News April 15, 2026

అమ్మాయిలకు మీసాలు.. కారణమిదే

image

కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిల్లా మీసాలు, గడ్డాలు రావడంతో పాటు ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. ఈ సమస్యను హిర్సుటిజం(Hirsutism) అంటారు. ఈ సమస్య PCOD, థైరాయిడ్ ఉన్నవారిలో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో చాలా తక్కువ మోతాదులో ఉండే మేల్ హార్మోన్స్ పెరగడం, కొన్నిరకాల మందులు వాడటం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. సమస్యను గుర్తించగానే వైద్యులను సంప్రదించడం మంచిది.