News October 29, 2024

కృష్ణుడిగా మహేశ్ బాబు.. నిజమిదే!

image

‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కృష్ణుడి పాత్రలో కనిపిస్తారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఇవన్నీ పూర్తిగా అవాస్తవమని, ఆయన ఎలాంటి పాత్రలో నటించడం లేదని సినీవర్గాలు క్లారిటీ ఇచ్చాయి. మూవీ టీమ్ అలాంటి ప్లాన్ కూడా చేయలేదని తెలిపాయి. రాజమౌళి సినిమా కోసమే మహేశ్ సిద్ధమవుతున్నారని, లుక్ కూడా ఆ చిత్రం కోసమేనని వెల్లడించాయి. కాగా, SSMB29 షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది.

Similar News

News January 2, 2026

ఫలించిన కృషి.. వెల్లువెత్తిన పెట్టుబడులు

image

AP: పెట్టుబడుల ఆకర్షణలో CM చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ఫోర్బ్స్ <<18742857>>విడుదల<<>> చేసిన డేటాలో 25.3% పెట్టుబడులతో దేశంలో టాప్‌లో నిలవడమే ఇందుకు నిదర్శనం. గతేడాది విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 613 ఒప్పందాలు, రూ.13.26 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ల ఒప్పందాలు కుదిరాయి. CBN, లోకేశ్ పలుమార్లు విదేశాల్లో పర్యటించి స్పెషల్ ఫోకస్ చేయడంతో పెట్టుబడులు వెల్లువెత్తాయి.

News January 2, 2026

సంక్రాంతికి ‘ఫ్రీ టోల్’పై AP నుంచి విజ్ఞప్తులు

image

సంక్రాంతికి ‘ఫ్రీ టోల్’కు అనుమతించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రమంత్రి నితిన్ <<18713147>>గడ్కరీకి లేఖ<<>> రాసిన విషయం తెలిసిందే. తాజాగా TDP MP సానా సతీష్ బాబు కూడా గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ‘పండుగ వేళ AP-TG మధ్య వసూళ్లు రద్దు చేసి ఫ్రీ టోల్ ప్రయాణానికి అనుమతివ్వాలి. HYD–VJA కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. దయచేసి APకి వచ్చేవారి ప్రయాణాన్ని సుఖమయం చేయాల్సిందిగా విజ్ఞప్తి’ అని ట్వీట్ చేశారు.

News January 2, 2026

ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్

image

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు-5 రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ తన ప్రియురాలిని పరిచయం చేశారు. కొంతకాలంగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ‘gods plan❤️’ అంటూ తన ప్రియురాలితో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే ఆమె ఫేస్, పేరు రివీల్ చేయలేదు. ఆయనకు అభిమానులు, ఫాలోవర్స్ అభినందనలు చెబుతున్నారు. 2021లో యూట్యూబర్ దీప్తి సునయనతో బ్రేకప్ అయిన విషయం తెలిసిందే.