News January 17, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ పార్టీలో మహేశ్ బాబు

చాలారోజుల తర్వాత విక్టరీ వెంకటేశ్, ప్రిన్స్ మహేశ్ బాబు ఒకేచోట చేరి సందడి చేశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్ అయింది. అప్పటి నుంచి వెంకీ, మహేశ్‌ను పెద్దోడు, చిన్నోడు అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. తాజాగా పెద్దోడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ పార్టీలో చిన్నోడు మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మేకర్స్ Xలో పోస్ట్ చేశారు.
Similar News
News November 23, 2025
సాయి సేవా స్ఫూర్తితోనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు

మన ముందు నడయాడిన దైవం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా ఆయన చూపిన సేవా మార్గాన్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సేవలతో ‘మానవ సేవే మాధవ సేవ’ అని బాబా నిరూపించారని తెలిపారు. సత్యసాయి సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి జ్ఞానం, సన్మార్గం లభించాయని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం దివ్యాంజలి ఘటించారు.
News November 23, 2025
మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.
News November 23, 2025
సామ్ కరన్ ఎంగేజ్మెంట్

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.


