News September 8, 2024
‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మహేశ్ బాబు?

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే తారక్, మహేశ్ను ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలుగుతుందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 10న దేవర ట్రైలర్ను ముంబైలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
Similar News
News August 18, 2025
హార్ట్ఎటాక్ను 12ఏళ్ల ముందే గుర్తించొచ్చు!

గుండెపోటు సంభవించడానికి పుష్కరం ముందే కొన్ని సంకేతాలు వస్తాయని అమెరికా హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. ఏటా ఓపిక తగ్గుతూ ఉంటే మీ గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం. ‘5KMPH వేగంతో నడవటానికీ ఇబ్బందిపడటం. చిన్న పనులు, వ్యాయామం చేసినా త్వరగా అలసిపోవడం, ఊపిరి ఆడకపోవడం’ వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి. వేగంగా నడవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
News August 18, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు వాయుగుండంగా మారుతుందని APSDMA హెచ్చరించింది. దీని ప్రభావంతో APలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఇవాళ పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వగా, రేపు కూడా ఇవ్వాలా? లేదా? అనేది పరిస్థితిని బట్టి చెబుతామని మంత్రి <<17441655>>సంధ్యారాణి<<>> తెలిపారు. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రకటనేది రాకపోవడంతో రేపు స్కూళ్లు యథావిధిగా నడిచే అవకాశముంది.
News August 18, 2025
తప్పుడు ప్రచారాలతో వైసీపీ గందరగోళం సృష్టిస్తోంది: CM చంద్రబాబు

AP: నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే YCP పని అని CM చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘రాజధాని మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని సొంత టీవీ, పత్రికల్లో అసత్య ప్రచారం చేయిస్తోంది. ఊళ్లు మునిగిపోతున్నాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తప్పుడు వార్తలతో గందరగోళం సృష్టించాలని చూస్తోంది. ఈ ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలి’ అని మంత్రులు, పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.