News January 2, 2025
మరోసారి థియేటర్లలోకి మహేశ్ బాబు ‘అతిథి’

మరో రెండుమూడేళ్ల వరకూ మహేశ్ బాబు కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన పాత సినిమాల్ని నిర్మాతలు రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, మురారి తదితర సినిమాలు విడుదల కాగా.. వచ్చే నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘అతిథి’ రీ-రిలీజ్ అవుతోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో 2007లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. మరి రీ-రిలీజ్లో ఎలా అలరిస్తుందో చూడాలి.
Similar News
News December 5, 2025
నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 5, 2025
పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.
News December 5, 2025
సీఎం ఓయూ పర్యటన వాయిదా

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.


