News January 25, 2025
రాజమౌళి పోస్ట్‌కు మహేశ్‌బాబు కామెంట్.. ఏంటంటే?

మహేశ్ సినిమాపై అప్‌డేట్ ఇస్తూ డైరెక్టర్ <<15250716>>రాజమౌళి<<>> నిన్న ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దానికి ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అని మహేశ్ కామెంట్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్నట్లు రాజమౌళి నిన్న వీడియో షేర్ చేశారు. దీంతో #SSMB ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ మూవీని రూ.1000Crతో నిర్మించనున్నట్లు సమాచారం.
Similar News
News January 19, 2026
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చెయ్యండి

ప్రస్తుతకాలంలో మారిన జీవనశైలి వల్ల చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువవుతాయంటున్నారు నిపుణులు. ఆహారంలో తెల్ల బియ్యం, మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం, క్రమంగా వ్యాయామం, మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.
News January 19, 2026
హర్షిత్ రాణాను చూసి NZ ప్లేయర్స్ వణికారు: క్రిస్ శ్రీకాంత్

NZతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయినప్పటికీ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా (52) తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. గతంలో ఆయన ఎంపికను విమర్శించిన మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఇప్పుడు హర్షిత్ ఆటతీరుకు ఫిదా అయ్యారు. ‘హర్షిత్ బ్యాటింగ్ చూస్తుంటే కివీస్ బౌలర్లు వణికిపోయారు. అతడు రియల్ గేమ్ ఛేంజర్’ అని ప్రశంసించారు. కోహ్లీ సెంచరీ వృథా అయినా.. హర్షిత్ పోరాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
News January 19, 2026
నితిన్ నబీన్ ఎంపిక వెనుక వ్యూహం ఇదేనా?

BJP జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నితిన్ నబీన్ ఎంపిక వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో యువ నాయకత్వానికి సంకేతం ఇవ్వడంతో పాటు యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివాద రహితుడిగా, PM మోదీ, అమిత్ షాకు నమ్మకమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. నబీన్ అధ్యక్షతన 2029 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధం కానుంది.


